
ఇక గుజరాత్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే గుజరాత్ జట్టు మరోసారి విజయ డంకా మోగించింది అని చెప్పాలి. అయితే గుజరాత్ విజయం అయితే సాధించింది. కానీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రివ్యూ విషయంలో క్లారిటీ లేని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీపర్ సాహను గుడ్డిగా నమ్మి చివరికి సక్సెస్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో 13 ఓవర్ ని మోహిత్ శర్మ వేశాడు. ఈ క్రమంలోనే ఒక బంతి బ్యాటర్ ను మిస్ చేసుకుని కీపర్ సాహా చేతుల్లోకి వెళ్ళింది. అయితే సహా గట్టిగా అప్పీల్ చేశాడు.
అయితే తనకు బంతి బ్యాట్ కి తగిలినట్లుగా ఎక్కడ సౌండ్ వినిపించలేదు అని కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలర్ మోహిత్ శర్మ చెప్పినప్పటికీ సాహా మాత్రం లేదు నాకు సౌండ్ వచ్చింది బంతి బ్యాట్ కి తాకింది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అయితే అప్పటికే డిఆర్ఎస్ సమయం ముగిసి పోవడానికి ఒక్క సెకండ్ మాత్రమే మిగిలింది. అలా చివరి సెకండ్ లో సాహాను గుడ్డిగా నమ్మిన హార్థిక్ పాండ్యా రివ్యూ కు వెళ్ళాడు. అయితే రిప్లై లో మాత్రం బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకినట్టుగా అల్ట్రా ఎడ్జ్ లో స్ట్రైక్ రావడంతో ఇక అంపైర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మను అవుట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో నవ్వుతూ సాహ దగ్గరికి వెళ్లిన హార్దిక్ పాండ్యా హగ్ చేసుకుని అభినందించాడు.