ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈనెల 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా అటు గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ అడుగుపెట్టిన మొదటి టీమ్గా నిలిచింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లక్నోపై విజయం సాధించడంతో ఇక మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంది ముంబై ఇండియన్స్.


 ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో అడుగుపెట్టబోయే రెండో టీం గా నిలుస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఫైనల్ లోకి వచ్చే రెండో టీం ఏది అనే విషయంపై గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. కాగా నేడే గుజరాత్, ముంబై జట్ల మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఫైనల్ చేరిన చెన్నై ప్లేయర్స్ ఇక తమ ప్రత్యర్థి ఎవరైతే బాగుంటుంది అనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ తో ఫైనల్లో తలబడాలని కోరిక మాకు లేదని చెన్నై మాజీ క్రికెటర్ బ్రావో చెప్పుకొచ్చాడు. దాదాపు పది సీజన్ల పాటు చెన్నై తరపున ఆడిన బ్రావో ఇక ఇప్పుడు ఆ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల బ్రావో మాట్లాడుతూ.. ఫైనల్ లో ముంబై ఇండియన్స్ తో తలబడటం నాకు ఇష్టం లేదు. నా స్నేహితుడు పోలార్జూకి కూడా దాని గురించి తెలుసు. కానీ అన్ని టీమ్లకు నా నుంచి ఆల్ ది బెస్ట్.. ఫైనల్ లో ఎవరు నిలుస్తారు అనే విషయం పైనే మా వ్యూహాలు ఆధారపడి ఉంటాయి అంటూ బ్రావో చెప్పుకొచ్చాడు. ఒక రకంగా ముంబై ఇండియన్స్ తో ఫైనల్ అంటే బ్రావో కాస్త భయం ఉంది అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఎందుకంటే ఇప్పటివరకు నాలుగు సార్లు ఐపీఎల్ ఫైనల్ తలపడ్డాయి చెన్నై, ముంబై జట్లు. మూడుసార్లు ముంబై గెలిస్తే ఒకసారి చెన్నై గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl