
అదే సమయంలో ఇక అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడు ఎవరు? ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న ప్లేయర్ ఎవరు అన్న విషయం గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఇక 2023 ఐపీఎల్ సీజన్లో ఎక్కువ ఫోర్లు కొట్టిన టీం ఏది? ఎక్కువ సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించిన టీం ఏది అనే దాని గురించి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్సర్లు బాదిన టీమ్ ఏది అని చూస్తే ఆ రికార్డును ముంబై ఇండియన్స్ సాధించింది.
ముంబై ఇండియన్స్ ఆడిన అన్ని మ్యాచ్లలో కలిపి ఏకంగా ఆ జట్టు బ్యాట్స్మెన్లు 140 సిక్సర్లు బాదారు. ఇక ఆ తర్వాత స్థానంలో 133 సిక్సర్లు బాధి అత్యధిక సిక్సర్లు కొట్టిన టీంగా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతుంది. ఆ తర్వాత కోల్కతా 125, గుజరాత్ 124, పంజాబ్ 117, లక్నో 115, రాజస్థాన్ 112, బెంగళూరు 107, సన్రైజర్స్ 84, ఢిల్లీ 67 సిక్సర్లు కొట్టి ఇక ఆ తర్వాత స్థానంలో ఎక్కువ సిక్స్ లు కొట్టిన టీమ్ లుగా కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ఇక అత్యధిక ఫోర్లు బాదిన జట్టుగా కూడా ముంబై ఇండియన్స్ రికార్డులు సృష్టించింది. మొత్తంగా 2023 ఐపీఎల్ సీజన్లో 265 ఫోర్లు బాందింది ముంబై ఇండియన్స్.