ప్రస్తుతం భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి చర్చ జరుగుతుంది. ఇక ఈ మెగా పోరుకి సమయం ఆసన్నమవుతున్న నేపథ్యం  లో క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పోటీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పాలి. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యం లో ఇక మాజీ ఆటగాళ్లు అందరూ కూడా రివ్యూలు ఇవ్వడం లో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరు విజేతగా నిలుస్తారు ఇరు జట్ల బలాబలాలు ఏంటి అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపం లో సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంపై కూడా ఆయా క్రికెట్ బోర్డులకు కీలక సూచనలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదే విషయంపై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. డబ్ల్యూటీసి ఫైనల్ కోసం టీమిండియా ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అంటూ  పాంటింగ్ అంచనా వేశాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ లకు ఇద్దరికీ జట్టులో చోటు దక్కుతుంది. జడేజా బౌలింగ్ చేయడంతో పాటు ఆరో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అశ్విన్ తెలివైన బౌలర్. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో అశ్విన్, రవీంద్ర జడేజాలకు తప్పకుండా ఛాన్స్ దక్కుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు రికీ పాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc