అయితే వెస్టిండీస్ టూర్ లో ఇలా రహనేకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గురించి బీసీసీఐ మాజి అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన రహానేను భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ గా ఎందుకు నియమించారో అర్థం కావట్లేదు అంటూ అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. 35 ఏళ్ల రహానే డబ్ల్యూటీసి ఫైనల్ తో టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ మ్యాచ్లో రాణించిన అతన్ని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ పర్యటనకు వైస్ కెప్టెన్ గా నియమించింది. అయితే సీనియర్ బ్యాట్స్మెన్ రహానేకు కాకుండా శుభమన్ గిల్ లాంటి కుర్రాడికి బాధ్యతలు అప్పగించాల్సింది అంటూ మాజీలు అభిప్రాయపడ్డారు
ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో సౌరబ్ గంగూలీని ప్రశ్నిస్తే ఇక ఆయన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశా రు నేను కూడా అదే అనుకుంటున్నా.. అయితే రహానేకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వెనకడుగు అనుకోను కానీ 18 నెలల పాటు జట్టుకు దూరమై. పునరాగమనంలో ఒక్క మ్యాచ్ ఆడిన ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో సెలెక్టర్ల ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడబోయే జట్టులో అటు రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు వైస్ కెప్టెన్సీకి అతను అర్హుడు కూడా ఏ మ్యాచ్ కోసం అయినా సెలక్షన్ నిలకడగా ఉంటే బాగుంటుంది అంటే సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి