టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి కొత్తగా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో తనను తానే పరిచయం చేసుకొని అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. అందరిలాగే ఒక సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. తక్కువ సమయంలోనే తాను వచ్చిపోయే ఆటగాడిని కాదు చరిత్ర సృష్టించి జట్టులో పాతుకుపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. ఈ క్రమంలోనే కెరియర్ ఆరంభం నుంచి రికార్డులు కొల్లగొట్టడం మొదలు పెట్టిన కోహ్లీ.. ఇక వరల్డ్ క్రికెట్లో రికార్డుల రారాజుగా మారిపోయాడు అని చెప్పాలి.


 కేవలం ఇండియాలోనే కాదు కోహ్లీ ఆటను ఆరాధించే క్రికెట్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. అయితే రికార్డుల విషయంలో నేటితరం క్రికెటర్లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. కేవలం రికార్డులు మాత్రమే కాదండోయ్.. అటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకోవడం విషయంలో కూడా అతనికి సాటి ఎవరూ లేరు. అయితే ఇలా ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు ఇటీవల మరో అరుదైన రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు.


 ఏకంగా 5వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు విరాట్. సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే, కుమార్ సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు మాత్రమే ఇప్పటివరకు  500లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఇప్పుడు వీరు సరసన కోహ్లీ చేరాడు. అయితే ఇదే విషయం గురించి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు ఆదర్శం అంటూ చెప్పుకొచ్చాడు. చరిత్రలో కోహ్లీ సాధించిన రికార్డులు, గణాంకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఘనత సాధించడానికి కోహ్లీ పడిన శ్రమ ఎవరికీ తెలియదని.. ఇక కోహ్లీ పట్టుదలే 500 మ్యాచ్లు ఆడేలా చేసిందని.. యువకులతో పోటీపడే అతని ఫిట్నెస్ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: