టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఆటగాడు అని చెప్పవచ్చు. మన దేశానికి ఎన్నో మరుపురాని విజయాలను అందించిన ఘనత ఒక్క ధోనీకే దక్కుతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలను మూడుసార్లు భారతదేశానికి అందించిన గొప్ప కెప్టెన్ ఇతడు. ధోనీ ఒకవైపు కెరీర్‌లో ఎవరూ అందుకోలేని ఉన్నత శిఖరాలకు ఎదుగుతూనే మరోవైపు సంపాదనలో కూడా మిగతా క్రికెటర్లందరినీ వెనక్కి నెట్టేసాడు.
ఇప్పుడంటే ఓల్డ్ అయిపోయాడు కానీ ఒకప్పుడు ధోని సంపాదన వందల కోట్లలో ఉండేది. 42 ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ ఏడాదికి రూ.50 కోట్లు సంపాదిస్తున్నాడంటే అతనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ ఆటగాడు ఇంకా ఎక్కువ మనీ వెనకేసుకున్నాడు. ఓ ఇంగ్లీష్ మీడియా రిపోర్ట్ ప్రకారం, ఈ మిస్టర్ కూల్ ఏకంగా రూ.1,000 కోట్లకు అధిపతి అయ్యాడు.
ధోనీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తండ్రి పాన్ సింగ్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన MECONలో జూనియర్ మేనేజ్‌మెంట్ హోదాలో పనిచేసేవారు. అప్పట్లో జీతాలు పెద్దగా ఉండేవి కావు. చాలీచాలని శాలరీలతోనే పాన్ సింగ్ జీవనం కొనసాగించేవారు. ధోనీకి అక్క జయంతి గుప్తా, అన్నయ్య నరేంద్ర సింగ్ ఉన్నారు. వారందరూ తండ్రి జీతంపైనే ఆధారపడుతూ మధ్యతరగతి కుటుంబం పడే కష్టాలన్నీ పడ్డారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ధోనీ ఇప్పుడు వేలకోట్లకి పడగలెత్తాడు.
అయితే ధోనీ కోటీశ్వరుడు అయ్యాడు, సరే! మరి అతని అక్క, అన్నయ్య పరిస్థితి ఏంటి? అని క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆరా తీస్తూనే ఉన్నారు. కాగా తాజాగా వారి ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం జయంతి గుప్తా ఇప్పటికీ చాలా నార్మల్ లైఫ్ కొనసాగిస్తోంది. ఆమె ప్రస్తుతం రాంచీలోని ఓ పబ్లిక్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా వర్క్ చేస్తోంది. సాధారణంగా తమ్ముడు కోట్లు సంపాదిస్తుంటే అతని చంతే చేరి ఏదో ఒక మంచి హోదా దక్కించుకొని లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు కానీ జయంతి గుప్తా మాత్రం ఎవరి మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద బతుకుతూ ఉందని తెలుస్తోంది. జయంతి ధోనీకి బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరైన గౌతం గుప్తాని పెళ్లాడింది. ఇక ధోనీ అన్నయ్య నరేంద్ర సింగ్ ఏం చేస్తున్నారనేది తెలియ రాలేదు.
జయంతి ధోనీకి మంచి సపోర్టు సిస్టమ్‌గా ఉండేదని అంటుంటారు. యుక్త వయసులో క్రికెట్ ఆడదామని ధోనీ ఎప్పుడూ కోరుకుంటుండేవాడు. అది తండ్రికి నచ్చకపోయేది కాదు ఆ సమయంలో జయంతి తన తండ్రికి నచ్చజెప్పి ధోనీ తన కలలను నెరవేర్చుకునే విషయంలో చాలా సహాయం చేసిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి