ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ ఐసీసీ టోర్ని ప్రారంభం కాబోతుంది. అయితే ఇక ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఈ షెడ్యూల్ నేపథ్యంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు  తమ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఇక వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించాయి అని చెప్పాలి. అయితే భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో టీమిండియా అటు హాట్ ఫేవరెట్ గా బరోలోకి దిగపోతుంది.

 అయితే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు అటు వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టు వివరాలు ప్రకటించినప్పటికీ టీం ఇండియా మాత్రం ఇలా జట్టును ప్రకటించడం విషయంలో కాస్త ఆలస్యం చేసింది. అయితే ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత ఇక వరల్డ్ కప్ కోసం జట్టు వివరాలను ప్రకటిస్తాము అంటూ స్పష్టం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక చెప్పినట్లుగానే ఇటీవల వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు వివరాలను ప్రకటించింది. అయితే కొంతమంది సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేసారు  సెలక్టర్లు. ఒకప్పుడు భారత జట్టు తరఫున ఓపెనర్ గా ఎన్నో అద్వితీయమైన ఇన్నింగ్స్ లు ఆడిన శిఖర్ ధావన్ పక్కన పెట్టేశారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ధావన్ అభిమానులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయింది. దావాన్ లాంటి ఆటగాన్ని పక్కన పెట్టడం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే ఇక తనకు జట్టులో చోటు ఇవ్వకపోవడంపై ఇటీవల శిఖర్ ధావన్ స్పందించాడు. ఇలా స్పందించాడు అనగానే ఏదో నెగిటివ్ గానే మాట్లాడాడు అని అందరూ అనుకుంటారు. కానీ దావన్ మంచి మనసు చాటుకున్నాడు. టీమిండియా కు సెలెక్ట్ అయిన ఆటగాళ్లకు విషెస్ చెబుతూ.. ఒక పోస్ట్ పెట్టాడు. టీమిండియా తరఫున వరల్డ్ కప్ లో ఆడనున్న నా టీ మేట్స్, ఫ్రెండ్స్ కి అభినందనలు. మీరు 1.5 బిలియన్ ప్రజల ప్రార్థనలు, నమ్మకాన్ని మోసుకొని వెళ్తున్నారు. కప్పుని తిరిగి తీసుకురండి. మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ అటు శిఖర్ ధావన్ పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. స్పోర్టివ్ నెస్ అంటే ఇది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: