
అయితే రేపటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ప్రారంభం కాబోతూ ఉండగా అటు మహమ్మద్ సిరాజ్ కి మాత్రం వరల్డ్ కప్ కి ముందు ఊహించని భంగపాటు ఎదురయింది అన్నది తెలుస్తుంది. మొన్నటి వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో కొనసాగాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా తొమ్మిది ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు.
ఈ క్రమంలోనే మహమ్మద్ సిరాజ్ ఏకంగా 11 పాయింట్లు కోల్పోయాడు అని చెప్పాలి. దీంతో ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫేసర్ హెజిల్ వుడ్ అగ్రస్థానానికి రాగా సిరాజ్ అతనితో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సిరాజ్కి 680 పాయింట్లు ఉండగా.. ఇక ఎక్కువ పరుగులు ఇవ్వడంతో 11 పాయింట్లు కోల్పోయాడు. అయితే అటు హెజిల్ వుడ్ 669 పాయింట్లతో ఉన్నాడు దీంతో ఇద్దరికీ సమానమైన పాయింట్లు ఉండడంతో ఇక అగ్ర పీఠాన్ని ఇద్దరు సంయుక్తంగా పంచుకున్నారు. ఇక వరల్డ్ కప్ లో ఎవరు మంచి ప్రదర్శన చేస్తే ఇక వాళ్లు ఇక వన్డే ర్యాంకింగ్స్ లో మళ్ళీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది అని చెప్పాలి