
దీంతో ఆయా టీమ్స్ లో ఏ ఆటగాళ్లు ఉన్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చింది. దీంతో ఆయా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఇక తమ అంచనాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉన్నారు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఇటీవల భారత మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ సైతం ఇదే విషయంపై స్పందించాడు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో ఇద్దరు ప్లేయర్లు ఎంతో ప్రత్యేకం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ గంభీర్.
2023 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు అంటూ గౌతమ్ గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో బాబర్ నుంచి మూడు లేదా నాలుగు సెంచరీలు వస్తాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఈ వరల్డ్ కప్ టోర్నిలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాప్ స్కోరర్ గా నిలుస్తాడు అంటూ కామెంట్ చేశాడు. కాగా ఈ మాజీ ప్లేయర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.