ఇక ఇప్పుడు భారత యంగ్ ప్లేయర్ ఆశుతోష్ శర్మ గురించి అందరూ ఇలాగే చర్చించుకుంటున్నారు. ఎన్నో రోజులుగా పదిలంగా ఉన్న ఒక లెజెండ్ రికార్డును ఇటీవల ఈ యంగ్ ప్లేయర్ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ హిస్టరీలో ఒక సరికొత్త రికార్డు నమోదయింది అని చెప్పాలి. 16 ఏళ్ల కిందట టీ20 ఫార్మాట్లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలైంది. అప్పట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేదు. అయితే ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా గ్రూప్ సీలో అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో రైల్వేస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆశుతోష్ శర్మ లెజెండ్ యువరాజ్ రికార్డును బ్రేక్ చేశాడు.
25 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ కేవలం 11 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసాడు అని చెప్పాలి అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు ఒక ఫోర్ ఉన్నాయ్ అంటే ఇక అతను ఎంతలా విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత బంతికే ఆషు తోష్ వికెట్ కోల్పోయి పెవెలియన్ చేరడం గమనార్హం. రైల్వేస్ ఇన్నింగ్స్ లో ఐదు ఓవర్లు మిగిలి ఉన్నాయి అన్న సమయంలో.. ఆశుతోష్ క్రీజ్ లోకి వచ్చాడు. ఇక అతను సిక్సర్లతో విరుచుకుపడటంతో చివరి 5 ఓవర్లలో రైల్వేస్ 115 పరుగులు చేసింది. మొత్తంగా 246/5 చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి