అలాంటి షాహీన్ ఆఫ్రిది ఇటీవలే జరిగిన మ్యాచ్లో మాత్రం ఏకంగా ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ షాహిన్ ఆఫ్రిది చేసిన ప్రదర్శన మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది. ఇటీవలే పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఇక ఇందులో షాహీన్ ఆఫ్రిది 10 ఓవర్లు వేసి 5.40 ఎకానమీతో 54 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
సెంచరీలతో చెలరేగిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడంలో షాహిన్ సక్సెస్ అయ్యాడు. మార్ష్, గ్లైన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ లను అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే షాకీన్ ఆఫ్రిథి ప్రదర్శన పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బెంగళూరులోని ఫ్లాట్ పిచ్ పై షాహీన్ 5 వికెట్లు తీయడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం షాహిన్ తప్ప మిగతా బౌలర్లు ఫెయిల్ అయ్యారని విమర్శించాడు. ఇలా ఆస్ట్రేలియాపై షాహీన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో అతను ఒక డేగ లాగా కనిపించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు ఇర్ఫాన్ పఠాన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి