అయితే ఇలా ఎవరైనా క్రికెటర్ కానీ లేదా సినీ సెలబ్రిటీలు కానీ తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అనుభవాల గురించి ఏదైనా పుస్తకం రాశారు అంటే చాలు అలాంటి పుస్తకాలను చదవడానికి అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక అందరికీ తెలిసిన సెలబ్రిటీ గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు తాను కూడా ఇలాంటి ఒక పుస్తకాన్ని రాస్తాను అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానీష్ కనేరియా. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు అని చెప్పాలి.
పాకిస్తాన్ క్రికెట్ టీం లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై త్వరలోనే ఒక పుస్తకం రాసేందుకు అంగీకరించాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానీష్ కనేరియా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చేసిన ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించాడు అని చెప్పాలి మీ ప్రతిపాదనకు ధన్యవాదాలు. పాకిస్తాన్ క్రికెట్ టీం లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై త్వరలోనే పుస్తకాన్ని మొదలుపెడతాడు. మీ అందరి నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను అంటూ కానేరియా చెప్పుకొచ్చాడు నిష్పక్షపాతంగా ఉండే పాకిస్తానీలు కూడా తనకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ కనేరియా చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి