ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడం.. అది కూడా ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలు కావడం పాకిస్థాన్కు నిజంగా అవమానమే అని చెప్పాలి. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కూడా పాకిస్తాన్ క్రీడాకారులు అభిమానుల అంచనాలను ఎక్కడ అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రీడాకారుల్లో కనీస ఫిట్నెస్ స్థాయిలు లేకపోవడం అభిమానులకు తీవ్ర అగ్రహాన్ని తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఓటమి అంటే నిజంగా తలవంపులే.
జస్ట్ రెండు వికెట్లు. 280- 90 స్కోర్ పెద్దదేమీ కాదు. పిచ్ సంగతి పక్కన పెడితే ఓసారి పాకిస్తాన్ ఫీల్డింగ్ చూస్తే వీళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయిపోతుంది. పాకిస్తాన్ ఆటగాళ్లలో రెండేళ్లుగా ఫిట్నెస్ తగ్గిందని మ్యాచ్ సందర్భంగా మేము ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఇక్కడ క్రీడాకారుల పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు. కానీ వీళ్ళు రోజుకి 8 కేజీల చొప్పున మటన్ తింటున్నట్టు ఉంది. వాళ్ళు దేశం తరఫున బరిలోకి దిగారు. ఇందుకోసం పారితోషకం కూడా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కాస్త ప్రొఫెషనల్ గా ఉంటే బాగుంటుంది అంటూ వసీం అక్రమ్ సూచించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి