టీమిండియా ఓటమితో 140 కోట్ల మంది యావత్ భారత్ మొత్తం నిరాశలో మునిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా నిరాశలో ఉన్న ప్రేక్షకులను ఆ బాధ నుంచి బయట పడేసేందుకు ఇప్పుడు ఇండియా వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. ఇలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు చాలానే జరుగుతాయి. కానీ ఇక ఫైనల్ ఓటమి బాధ నుంచి బయటపడటం అంత సులువు కాదు అని ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఇటీవల ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే అందరూ వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధ నుండి బయటపడ్డారు.
భారత క్రికెట్ అభిమానులందరికీ కూడా మొదటి టీ20 మ్యాచ్ కొత్త ఉత్సాహం అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి 29 పరుగులు చేయగా.. భారీ టార్గెట్ ను చేదించేందుకు యంగ్ టీమిండియా వీరొచితంగా పోరాడింది. ఇక మ్యాచ్ చివరి బంతి వరకు రావడంతో అందరూ పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించారు. ఇక రింకు సింగ్ చివర్లో సూపర్ సిక్సర్ తో టీమిండియా కు విజయాన్ని అందించడం.. ఇది చూసి ఇక టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మైమరిచిపోయారు అని చెప్పాలి. అసలైన టి20 మజా అంటే ఇది అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి