క్రికెట్ అనేది ఫన్నీ గేమ్.. మైదానంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంత ఉత్కంఠ ఉంటుందో కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్ల మధ్య జరిగే సంభాషణలు ఏకంగా ఒకరితో ఒకరు సరదాగా పోట్లాడుకునే తీరు.. ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ గా సాగుతున్న సమయంలో ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ ను బ్యాట్ తో కొట్టడానికి వెంటపడ్డాడు. అదేంటి బ్యాట్ తో కొట్టడానికి వెంటపడితే అది సరదా సంఘటన ఎందుకు అవుతుంది? అయినా క్రికెట్ రూల్స్ ప్రకారం అలా ప్రవర్తించకూడదు కదా అంటారా.. అయితే ఇలా బ్యాట్ పట్టుకొని కొట్టడానికి పరిగెత్తింది.. కేవలం జోక్ గా మాత్రమే. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ మధ్య ఇది జరిగింది. త్వరలోనే పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతుంది.


 ఈ క్రమంలోనే ఈ పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఒక మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వాన్ వెంటపడి బాబర్ బ్యాట్ తో కొట్టబోయాడు. బౌలర్ వేసిన బంతిని అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఆ సమయంలో బాబర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈలోపు వికెట్ కీపర్ రిజ్వాన్ అది వైడ్ ఎలా అవుతుందంటూ అంపైర్ ను   ప్రశ్నిస్తూ స్టంప్స్ దగ్గరికి వచ్చాడు. పక్కనే ఉన్న బాబర్  సరదాగా రిజ్వాన్ వైపు దూసుకు వెళ్ళాడు. ఇక అతను వెంటపడి బ్యాట్ తో కొట్టబోయాడు. ఇక ఈ వీడియో వైరల్ అవ్వగా.. ఇది చూసి పాక్ క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా నవ్వుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: