ప్రస్తుతం భారత క్రికెట్లో ఒకే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఆ విషయం ఏదో కాదు ఐపీఎల్ 2024 సీజన్ గురించి. బిసిసిఐ ఇప్పటినుంచే అటు వచ్చే ఐపిఎల్ సీజన్ గురించి అన్ని సన్నాహాలను మొదలుపెట్టింది. డిసెంబర్ 19వ తేదీన ఐపీఎల్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లు ఎంతో మంది ఉండడంతో ఈసారి భారీ ధర పలకడం ఖాయం అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు.


 అయితే మినీ వేళల్లో అటు యువ ఆటగాళ్లతో పాటు ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు కూడా పాల్గొనబోతున్నారు అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు.  ఇక మినీ వేలంలో రెండు కోట్ల బేస్ ప్రైస్ తో ఇక వేలంలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇలా 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ వేలానికి సంబంధించి ఆటగాళ్లు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది  ఈ క్రమంలోనే రెండు కోట్ల బేస్ ప్రైస్ తో ఎవరు ఈ మినీ వేలంలో పాల్గొనబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 హర్షల్ పటేల్, శార్దూల్ ఠాగూర్, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హెజిల్ వుడ్, హారీ బ్రూక్, బ్రాంటన్, క్రెగ్ ఓవర్ టన్, అదిల్ రషీద్, విల్లి, డకెట్, క్రిష్ వోక్స్, స్టీవ్ స్మిత్, ఇంగ్లీస్, ట్రావీస్ హెడ్, అబట్, ముజీబ్, కోయట్జి, రూసో, దస్సేన్, ఫెర్క్యూసన్, ఏంజెలో  మ్యాథ్యూస్, రెహమాన్ లాంటి క్రికెటర్లు రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలో పాల్గొన పోతున్నారు. అయితే ఐపీఎల్ వేలం జరగడానికి ముందే కొన్ని టీమ్స్ వేరే టీం లోని ఆటగాళ్లను తమ టీం లోని ప్లేయర్ తో మార్చుకునేందుకు ఒప్పందం చేసుకుంటూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl