ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా క్రికెట్ ఆటకు పుట్టినిల్లు ఇంగ్లాండ్ అని చెబుతూ ఉంటారు. కానీ ఇంగ్లాండ్లో ఆ ఆటకు ఉన్న క్రేజ్ కంటే అటు ఇండియాలో ఉన్న పాపులారిటీనే ఎక్కువ. ఇక అన్ని దేశాల్లో లాగానే భారత్లో కూడా ఎన్నో రకాల క్రీడలు ఆడుతూ ఉంటారు.  కానీ ఎందుకో క్రికెట్ నే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు క్రీడాభిమణులు. ఏదైనా క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు కోట్ల మంది ప్రేక్షకులు పని పక్కన పెట్టి మరి మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఏకంగా భారత జట్టులో ఉండే స్టార్ ప్లేయర్లను ఆరాధ్య దైవంగా అభిమానులు అందరూ కూడా అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ ను బట్టి అటు క్రికెటర్లకు ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా తమ ఫేవరెట్ క్రికెటర్లను లైఫ్ లో ఒక్కసారి కలిసిన చాలు అని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక తమ అభిమాన క్రికెటర్లను కలిసేందుకు మ్యాచ్ ను చూసేందుకు స్టేడియం కు వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే రిస్క్ చేసి సెక్యూరిటీని దాటుకొని మరి మైదానంలోకి పరుగులు పెట్టడం కూడా ఇప్పటివరకు చాలా సార్లు చూసాం.


 అయితే ఇటీవలే క్రికెటర్లను అభిమానులు ఎంతలా ప్రేమిస్తారో అన్నదానికి నిదర్శనంగా.. ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఇంగ్లాండ్తో ఉమెన్స్ టి20 మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే పలువురు బాలికలు ముంబై వాంకడే స్టేడియంకి వెళ్ళారూ. అక్కడ కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్  ఆటోగ్రాఫర్ తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అది వీలుపడకపోవడంతో.. ఒక బాలిక ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై హార్మన్ స్పందించింది. పరిపూర్ణమైన ప్రేమ అమాయకత్వం కనిపించిన క్షణం. మా ప్రేమ ఆశీర్వాదం ఆమెపై తప్పకుండా ఉంటాయి అంటూ హార్మన్ ప్రీత్ కౌర్ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: