సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన ప్రతి ఆటగాడు కూడా తమ కెరియర్ ని ఎక్కువ కాలం పాటు సాఫీగా కొనసాగించాలని అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఇక నిలకడైన పాంతో జట్టులో చోటును సుస్థిరం చేసుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే  ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా సరే ఒకానొక సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆటుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. కేవలం క్రికెట్లో మాత్రమే కాదు ఏ ఆటలో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది.


 కొంతమంది అవకాశాలు లేక నిరాశతో రిటైర్మెంట్ ఆలోచన చేస్తే ఇంకొంతమంది.. వయసు పెరిగిందని రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏదో ఒక ఫార్మాట్ కి పరిమితం కావడానికి మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి  కెరీయర్ని సాఫీగా సాగించాలని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటించాలి అనే ఆలోచన చేస్తే 40 ఏళ్ల వయసు దగ్గర పడుతున్న సమయంలో రిటైర్మెంట్ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక పాకిస్తాన్ క్రికెటర్ మాత్రం షాకింగ్ రీజన్ తో రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఏకంగా ఆటపై ఇష్టం తగ్గింది అనే కారణంతో పాకిస్తాన్ క్రికెటర్ ఆసద్ షఫిక్ అన్ని ఫార్మాట్లకు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నాకు క్రికెట్ పై మునుపు ఉన్నంత ఉత్సాహం ఇష్టం లేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్నెస్ కూడా లేదు. అందుకే అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలుకుతున్నాను అంటూ ఇటీవల ప్రకటన చేశాడు అసద్ షఫిక్. 37 ఏళ్ల షఫీక్ పాకిస్తాన్ తరపున 77 టెస్టులు 60 వన్డేలు 10 టి20 మ్యాచ్ లకు ప్రాతినీథ్యం వహించాడు అని చెప్పాలి. కాగా అతని రిటైర్మెంట్ తో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: