టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీ అటు ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ కప్ కోసం ఎంపికైనప్పటికీ కొన్నాళ్లపాటు అతను కేవలం బెంచ్ కే పరిమితమయ్యాడు.  బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గాయపడిన సమయంలో లక్కీగా భారత తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు మహమ్మద్ షమీ.



 కానీ ఆ తర్వాతే అందరికీ అర్థమైంది. అతను లక్కీగా ఛాన్స్ దక్కించుకోవడం కాదు భారత జట్టుకే అతను చాలా లక్కీ అని. ఎందుకంటే అతను టీమ్ ఇండియాలోకి వచ్చిన తర్వాత ప్రతి మ్యాచ్ లోను అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏకంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర వహించాడు. అతను బంతి అందుకున్నాడు అంతే చాలు ఏకంగా ప్రత్యర్థులు సైతం వణికిపోయే విధంగా షమీ ప్రస్థానం కొనసాగింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడబోయే టెస్ట్ సిరీస్ లో కూడా అతను భాగం కాబోతున్నాడు. అయితే చీలమండ గాయంతో బాధపడుతున్న షమి ఇక టెస్టు సిరీస్ లో ఆడటం మాత్రం అనుమానంగానే కనిపిస్తుంది అని చెప్పాలి..


 అయితే ఇటీవల కాలంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్న షమీ తన ఫిట్నెస్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ ప్లాన్ పై ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో నేను డైట్ ఫాలో అయ్యే వాడిని కాదు. బిర్యానీ బాగా తినేవాడిని. కానీ గాయాలు బెడద తీవ్రంగా వేధించిన తర్వాత నాకు మెనూ పూర్తిగా మార్చేశాను. బిర్యానీ అయితే పూర్తిగా తినడమే మానేసాను. రోజుకు ఒక్కసారి మాత్రమే తింటున్న. అది కూడా నాన్ వెజ్ తింటున్నాను. ఇప్పుడు నా ఫిట్నెస్ ఎంతగానో మెరుగయింది అంటూ మహమ్మద్ షమీ కామెంట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: