ప్రస్తుతం టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటంలో ఉన్న టీమిండియా సఫారీ జట్టుతో వరుసగా సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే t20 సిరీస్ ముగియగా ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే జోహాన్నస్ బర్గ్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో అటు భారత జట్టు సూపర్ డూపర్ విక్టరీని సాధించింది. ఏకంగా సఫారీలను వారి గడ్డమీద చిత్తుగా ఓడించి ఇక సిరీస్ లో ఆదిక్యాన్ని సంపాదించింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది భారత జట్టు. అయితే ఇక ఇలా సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టుకు వరుసగా షాకులు తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు స్టార్ బౌలర్ షమీ అందుబాటులో ఉండడం కష్టమే అనేది తెలుస్తుంది. ఇక వ్యక్తిగత కారణాలతో దీపక్ చాహార్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా సడన్గా జట్టు నుంచి తప్పుకొని స్వదేశానికి పయనమయ్యాడు. ఇక ఇప్పుడు భారత జట్టుకి మరో షాక్ తగిలపోతుంది అన్నది తెలుస్తుంది..


 గత కొంతకాలం నుంచి ఫుల్ ఫామ్ లో ఉంటూ భారత జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఇక మిగిలిన రెండు వన్డే మ్యాచ్ లకు దూరం కాబోతున్నాడట. ఈనెల 26వ తేదీ నుంచి అటు సౌత్ ఆఫ్రికా జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు సన్నదమయ్యేందుకు  వన్ డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. దీంతో రెండో వన్డేలో పలు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అయ్యర్ స్థానంలో రింకు సింగ్ వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: