ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఒకే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మూవీ ఏదో కాదు ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ గురించి. ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ట్రైలర్ చెప్పిన సమయానికంటే కాస్త ఆలస్యంగా విడుదలైనప్పటికీ.. ఇక అభిమానులు అందరికి కావాల్సిన ఎలిమెంట్స్ ఇక ఈ ట్రైలర్లు పుష్కలంగా ఉన్నాయి.


 చాలా రోజుల తర్వాత ప్రభాస్ అభిమానులు అందరూ యాక్షన్ రోల్లో డార్లింగ్ ని చూడబోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ మూవీలో కీలక పాత్రలో కోలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తూ ఉండగా.. ప్రభాస్ సరసన హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇటీవల విడుదలైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఇక సలార్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ మూవీలోని ఒక పాత్రలో ప్రభాస్ స్నేహితుడు అయిన గోపీచంద్ నటిస్తే బాగుండేది అని అభిమానులకు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత్ర ఏదో కాదు వరద రాజమన్నార్.


 గతంలో ప్రభాస్ గోపీచంద్ కాంబినేషన్లో వర్షం బ్లాక్ బస్టర్ అయింది ఇక వరదరాజమన్నార్ పాత్ర లో గోపీచంద్ బాగా సరి పోయేవాడు అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక సలార్ మూవీలో ఈ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు  పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇక ఇప్పుడు కుదరకపోయినా ఫ్యూచర్లో అయినా గోపీచంద్, ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: