సాధారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతివారం కూడా ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ను ప్రకటించడం లాంటిది చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఏకంగా నెంబర్ వన్ ర్యాంకును కట్టబెట్టడం చేస్తూ ఉంటుంది ఐసీసీ  అయితే ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్ లో ఒక్కసారైనా అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఎంతోమంది ఆటగాళ్లు  అయితే కొన్ని కొన్ని సార్లు యువ ఆటగాళ్లకు ఊహించని రీతిలో ఇలా అగ్రస్థానం దక్కుతూ ఉంటుంది అని చెప్పాలి.


 అయితే యువ ఆటగాళ్లకే ఇలాంటి అగ్రస్థానం దక్కితే అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లకు నెంబర్ వన్ స్థానం లోకి రావడం అంత కష్టమైన విషయం ఏమీ కాదు. కానీ ఇక క్రికెట్లో నేటి తరానికి లెజెండ్స్ గా మారే వారిలో ఒకడిగా కొనసాగుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఇప్పుడు వరకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐసిసి ర్యాంకింగ్స్ లో ఏదో ఒక ఫార్మాట్లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంటుంటే.. అటు రోహిత్ శర్మ మాత్రం మూడు ఫార్మాట్ లలో ఒక్కసారి కూడా అగ్రస్థానంలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే  రోహిత్ ఖాతాలో ఒక చెత్త రికార్డు చేరిపోయింది.


 అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లోను నెంబర్ వన్ ర్యాంకు చేరుకోకుండా అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లో కలిపి 468 మ్యాచ్ లు ఆడాడు. అయితే ఏ ఫార్మాట్లో కూడా ఇప్పుడు వరకు మొదటి ర్యాంకును అందుకోలేకపోయాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక రోహిత్ తర్వాత స్థానంలో బౌచర్ 467, మూష్పికర్ రెహమాన్  458, రాస్ టేలర్ 450, షోయబ్ మాలిక్ 446, అజారుద్దీన్ 436 మ్యాచ్ లతో తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి. ఈ విషయం తెలిసి రోహిత్ కి కెరియర్ ముగిసేసరికి ఒక్కసారైనా అగ్రస్థానం దక్కాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: