ఎన్నో ఏళ్లపాటు భారత జట్టుకు చీఫ్ సెలెక్టర్గా సేవలు అందించారు చేతన్ శర్మ. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ ఉన్న సమయంలోనే కాదు అంతకు ముందు కూడా ఇక చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ గానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే  కొన్ని కొన్ని సార్లు ఆయన జట్టు సెలక్షన్ పై విమర్శలు వచ్చినప్పటికీ  ఆయనని మాత్రం అదే పదవిలో కొనసాగిస్తూ వచ్చింది బీసీసీఐ. అలాంటి చేతన్ గతంలో ఏకంగా బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐకి మధ్య వైరం కొనసాగుతుంది అంటూ సంచలన విషయాలను తెలిపాడు. అంతేకాదు ఆటగాళ్ళ విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి కూడా అస్సలు బాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు చేతన శర్మ.


 అయితే ఇలా చేతన్ శర్మ చేసిన కామెంట్స్ కాస్త భారత క్రికెట్లో కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే ఇలాంటి కామెంట్స్ చేసిన వెంటనే తన చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు చేతన్ శర్మ. అయితే ఇలా గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి ఇక వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన చేతన్ శర్మ.. ఇక ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన గతంలో బీసీసీఐ, విరాట్ కోహ్లీ పై చేసిన వ్యాఖ్యల గురించి స్పందించాడు.


 టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తనకు కొడుకుతో సమానం అంటూ చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు. అతని గురించి నేను ఎందుకు చెడుగా మాట్లాడుతాను. విరాట్ కోహ్లీకి మంచి జరగాలని కోరుకుంటాను. విరాట్ కోహ్లీ త్వరలోనే మంచి కం బ్యాక్ ఇచ్చి 100 సెంచరీల రికార్డును అధిరోహిస్తాడు అని కోరుకుంటున్నాను అంటూ చేతన్ శర్మ కామెంట్స్ చేశాడు.  అయితే గతంలో చేతన్ శర్మ ఆటగాళ్ల ఫిట్నెస్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా పూర్తిస్థాయి ఫిట్నెస్ తో కనిపించేందుకు ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారని డోపింగ్ టెస్టులో కూడా అవి బయటపడవు అంటూ చేతన్ చర్మ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ లో ప్రకంపనలు  సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: