గత కొంతకాలం నుంచి బీసీసీఐ క్రికెటర్లు నిర్విరామంగా క్రికెట్ ఆడుతూ బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న నేపథ్యంలో.. ఇక కొంతమంది ప్లేయర్లకు కనీసం ఒక్క మ్యాచ్లో అయినా రెస్ట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా కొంతమంది ఆటగాళ్ళకు విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐ పెద్దలు సిద్ధమయ్యారు. మరి ముఖ్యంగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐసీసీ టోర్నీని దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టింది బీసీసీఐ. వరల్డ్ కప్ నాటికి ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేలా ఫిట్ గా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం భారత జట్టు అటు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఇందులో మూడు మ్యాచ్లు ముగిసాయ్. మూడు మ్యాచ్లలో భాగంగా రెండు మ్యాచ్లులో విజయం సాధించిన టీమ్ ఇండియా.. 2-1 తేడాతో ఆదిక్యంలో ఉంది  ఇక మిగిలిన రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించి ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించాలని పట్టుదలతో ఉంది భారత జట్టు. అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఇప్పుడు భారత జట్టు ఆడబోయే నాలుగో టెస్ట్ మ్యాచ్ కి కూడా ఊహించని షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా స్టార్ బౌలర్ బుమ్రా జట్టుకు దూరం కాబోతున్నాడట  అదేంటి అతనికి గాయం కాలేదు కదా.. ఇంకా ఎందుకు దూరం అవుతున్నాడు అనుకుంటున్నారు కదా.. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఇక అతనికి నాలుగో టెస్ట్ కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్ట్ ఫలితాన్ని బట్టి అతడు ఐదవ టెస్ట్ ఆడేది లేనిది డిసైడ్ కానుంది అని సమాచారం. ఒకవేళ నాలుగో టెస్టులో దురదృష్టవశాత్తు భారత జట్టు ఓడిపోతే ఐదో టెస్టులో మళ్ళీ బుమ్రా జట్టులో చేరే అవకాశం ఉంది. కాగా ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో 17 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు బుమ్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: