ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక పోయినప్పటికీ ఏకంగా ఛాంపియన్ టీమ్స్ స్ అయినా చెన్నై ముంబై జట్లతో సమానంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఏకంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విపరీతంగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇక ఈ జట్టు ట్రోఫీ గెలవకపోయినా అభిమానులు ఎప్పుడూ ఆ టీంకి మద్దతు పలుకుతూనే ఉంటారు అని చెప్పాలి.



 అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక ఇప్పుడు ఐపిఎల్ 17వ సీజన్లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఐపీఎల్ ప్రారమానికి ముందు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు మహిళల జట్టు టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఇదే రిపీట్ అవుతుందని అభిమానులు అందరూ కూడా గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు వరకు మూడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు ఒక విజయం మాత్రమే సాధించి రెండు మ్యాచ్లలో ఓడిపోయింది  ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది అని చెప్పాలి.


 దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో ఉన్నారు. అయితే కోల్కతాతో మ్యాచ్లో ఆర్సిబి జట్టు ఓడిపోయినప్పటికీ ఇక అటు అరుదైన రికార్డును మాత్రం సృష్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో 1500 సిక్సర్లు బాదిన రెండవ టీం గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు సాధించింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మాత్రమే ఈ లిస్టులో ఉంది. అయితే ఇటీవల కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 2 సిక్సర్లు గ్రీన్ రెండు సిక్సర్లు కొట్టడంతో ఇక ఈ రికార్డు సృష్టించింది ఆర్సిబి. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సిబి జట్టు తర్వాత మ్యాచ్లలో అయినా పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: