ఇటీవల బీసీసీఐ టి20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బిసిసిఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలు ప్రకటించిన నాటి నుంచి కూడా ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. ఐపీఎల్ లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లను సెలెక్టర్లు ఎందుకు వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టారు అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. నటరాజన్ కి కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు.


 ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న అతను తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనికి తప్పకుండా t20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని అభిమానులు అందరూ కూడా ఊహించారు. కానీ చివరికి సెలెక్టర్లు అతన్ని జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు. కనీసం రిజర్వ్ ఆటగాళ్ల లిస్టులో కూడా అతని పేరు కనిపించలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ ఫామ్ లో ఉన్న నటరాజన్ ను ఎందుకు ఎంపిక చేయలేదు అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా సెలక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


 ఇలా వరల్డ్ కప్ జట్టులో ఎంపిక అవ్వకుండా తీవ్ర నిరాశలో మునిగిపోయిన నటరాజన్ అభిమానులందరిలో కూడా ధైర్యం నింపే విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే నటరాజన్ భారత్కు ఆడతాడు అంటూ జోస్యం చెప్పాడు. భారత్ లో నాణ్యమైన ఆటగాళ్లు ఎక్కువ. అదే సమయంలో ఇక సెలక్ట్ కావడం అనేది నటరాజన్ చేతిలో లేదు. ఇక ఇదే ఫామ్ ని కొనసాగిస్తే మాత్రం రానున్న రోజుల్లో అతను తప్పకుండా మళ్లీ దేశం తరఫున ఆడుతాడు అంటూ సన్రైజర్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లలో నటరాజన్ 15 వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: