అయితే అటు ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించే ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుతం ప్రదర్శన చేస్తూ ఆయా జట్ల విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎప్పటి లాగానే ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. కానీ ఇటీవలే అంతర్జాతీయ మ్యాచ్ లు ఉండడం కారణంగా సరిగ్గా ప్లే ఆఫ్ సమయానికి ఇక ఇంగ్లాండ్ ప్లేయర్ లందరూ కూడా స్వదేశానికి వెళ్ళిపోయారు. దీంతో కీలక ప్లేయర్స్ ని దూరం చేసుకుని కొన్ని టీమ్స్ అయోమయం లో పడి పోయాయి అని చెప్పాలి.
అయితే ఇలా ఐపిఎల్ సమయం లో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించడం పై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ జరిగే సమయం లో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ చేయరాదు అంటూ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మ్యాచ్లకు ఏడాదిలో ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. కానీ ఐపీఎల్ అలా కాదు దాని కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ ఉంటుంది. అందుకే ఐపీఎల్ జరిగే సమయంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లోపెట్టకూడదు అంటూ బట్లర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.