టి20 ప్రపంచకప్ 2024 ఎడిషన్ లో భారత జట్టు ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. గత కొన్నెళ్ల నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో అంతకంతకు వెనుకబడిపోతున్నది ఇండియా. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ తోనే భారత గడ్డపై అడుగు పెట్టాలని పట్టుదలను పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే బాగా రాణిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతూ అదరగొడుతుంది.


 అయితే ఇక వరుసగా విజయాలు సాధించి సూపర్ 8లో అడుగుపెట్టిన టీమిండియా.. సూపర్ 8 లోను అదే రీతిలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే గతం ఏడాది అటు ఐసిసి టోర్నీ ఫైనల్స్ లో తమను ఓడించి ఇంటికి పంపించిన ఆస్ట్రేలియాపై.. ఇటీవల t20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో ప్రతి కారం తీర్చుకుంది. ఆసిస్ పై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ తో అదరగొట్టేసాడు. విధ్వంసకరమైన బ్యాటింగ్ తొ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టేసాడు. ఇలా మెరుపు ఇన్నింగ్స్ తో ఎన్నో అరుదైన రికార్డులను కూడా సృష్టించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఏకంగా 92 పరుగులతో అదరగొట్టిన రోహిత్ శర్మ.. టి20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 50 చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు రోహిత్ శర్మ. అయితే ఇదే రికార్డును గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ 2009లో గౌతమ్ గంభీర్ క్రియేట్ చేశాడు. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 12 బంతుల్లోని హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ ఈ రికార్డు సాధించిన ప్లేయర్ లు గా ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: