ఎందుకంటే ఇరుదేశాల మధ్య క్రీడా సంబంధాలపై నిషేధం కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ నిషేధం కారణంగా ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక ఈ చిరకాల ప్రత్యర్థుల పోరు ఎప్పుడు జరిగినా కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే నేడు ఇలా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ చివరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధులు తలపడబోతున్నాయి అని చెప్పాలి. దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ టోర్నీలో వరుస విజయాలతో భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్కు చేరింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు మాత్రం సరిగ్గా రానించలేక లీగ్ దశతోనే నిష్క్రమించేందుకు సిద్ధమైంది. కాగా నేడు జరగబోయే మ్యాచ్ నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ దాయాదుల పోరు కావడంతో హై వోల్టేజ్ ఉండడం పక్క. మధ్యాహ్నం 1:15 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ చూడవచ్చు.