ఇండియన్ క్రికెట్ టీం లో అద్భుతమైన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం టీం ఇండియాలోకి రంగ ప్రవేశం చేశాడు. ఇక టీం ఇండియాలోకి రంగ ప్రవేశం చేసిన కొద్ది కాలానికి ఈయన తన అద్భుతమైన ఆట తీరుతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. దానితో ఆయనకు అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతూ వచ్చింది. ఇక చాలా కాలం పాటు టీమిండియాలో కొనసాగిన ఈయన ఎన్నో మ్యాచ్ లకి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇకపోతే ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఎన్నో ఐ పి ఎల్ సీజన్లలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. ఇకపోతే రోహిత్ శర్మ ప్రస్తుతం ఐ పి ఎల్ లో ఆడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఐ పీ ఎల్ లో ఈ సీజన్ లో మాత్రం రోహిత్ శర్మ ఆట తీరు గొప్ప స్థాయిలో లేదు. దీనిపై రోహిత్ ఆట తీరుపై పలువురు విమర్శలను కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మాజీ క్రికెటర్ అయినటువంటి సంజయ్ మంజ్రేకర్ , రోహిత్ శర్మ ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సంజయ్ సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ గురించి స్పందించిన తీరుపై ఆయన అభిమానులు సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

అసలు విషయం లోకి వెళితే ... సంజయ్ తాజాగా రోహిత్ శర్మ గత 15 ఇన్నింగ్స్ లలో కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 10 ఇన్నింగ్స్ లను తన సొంత గడ్డపై నే ఆడాడు. ఆయన అతని సగటు 10.9 మాత్రమే. ప్రస్తుతం రోహిత్ శర్మ ఫిట్నెస్ ను బట్టి చూస్తే ఓపెనర్ గా అతని పని ముగిసినట్లే అని తెలిపారు. ఇక దీనిపై అనేక మంది రోహిత్ శర్మ అభిమానులు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్ ఇండియాలో 1122 రన్స్ చేస్తే రోహిత్ శర్మ ఇప్పటి వరకు 2538 బౌండరీ లు కొట్టాడు అని సంజయ్ పోస్ట్ కి రోహిత్ శర్మ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sm