
గత కొన్ని రోజులకు స్టార్ సింగర్ జాస్మిన్ వాలీయా తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ వార్తలు వినపడ్డాయి. దానికి తగ్గట్టే వాళ్ళు క్లోజ్ గా దిగ్గిన ఫోటోలు కూడా బాగా చక్కర్లు కొట్టాయి. వాళ్లు క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి . అయితే తాజాగా హార్దిక్ పాండ్యా .. జాస్మిన్ తో కూడా బ్రేకప్ చెప్పేస్కున్నట్లు తెలుస్తుంది . ఒకరికొకరు సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ మధ్యకాలంలో విడిపోతున్న.. బ్రేకప్ చెప్పుకుంటున్న సోషల్ మీడియాలో అన ఫాలో చేసుకుంటూ వస్తారు.
చాలా మంది స్టార్స్ ఇలానే చేస్తూ వచ్చారు. ఇప్పుడు హార్థిక్ పాండ్యా కూడా ఇలానే చేశారు . అయితే దీనిపై ఇరువైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ చాలామంది మాత్రం వీళ్ళు విడిపోతున్నారు అంటూ క్లారిటీ తీసేసుకున్నారు. కాగా ఐపిఎల్ సీజన్ లో హార్థిక్ పాండ్యాకు మద్దతుగా నిలుస్తూ ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్లకు జాస్మిన్ స్టేడియంలోకి రావడం వీళ్ళ ప్రేమకు ప్రముఖంగా నిలిచింది . దీనికి తోడు గ్రీసులో ఇద్దరు కలిసి రొమాంటిక్ గా దిగిన ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి . కాగా హార్దిక్ పాండ్యా - నటాషా ను 2020 వివాహం చేసుకున్నాడు. వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా ఇలా సింగర్ ని ప్రేమించి మళ్లీ బ్రేకప్ చెప్పుకోవడం ఆయన కెరియర్ కి ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసేస్తుంది అంటున్నారు ఆయన ఫ్యాన్స్..!!