వాట్సాప్‌.. నేటి త‌రానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని యాప్‌. స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ.. వాట్సాప్‌ను కూడా వినియోగిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా వాట్సాప్ ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయింది. ఇక వాట్సాప్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తూ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.  వాట్సాప్ లో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లలో వాయిస్, వీడియో కాల్స్ ఎంతో ప్రముఖమైనవి. ఎంతోకాలంగా ప్రజల్ని ఊరిస్తూ వచ్చిన డార్క్ మోడ్ ను కూడా ఈమధ్యనే బీటా వెర్షన్ ద్వారా అందించారు. 

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అయితే వాట్సాప్‌లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. ఇక సాధార‌ణం మ‌నం ఇతరులకు పంపిన వాట్సాప్‌ మెసేజ్ ను వారు చదివారో లేదో తెలుసుకునేందుకు బ్లూ టిక్ ఫీచర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే కొంద‌రు చాలామంది యూజర్లు తమ మెసేజ్ చదివినట్టు ఇతరులు తెలియడం ఇష్టపడటం లేదు. ప్రైవసీగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే వాట్సాప్ అకౌంట్లో రీడ్ రిసిప్ట్ ఎనేబుల్ ఉండేలా చూస్తారు. కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ట్రిక్ ఉప‌యోగిస్తే.. ఇత‌రులు బ్లూటిక్ ఆఫ్ చేసినా..  మీ మెసేజ్ చూశారా లేదో తెలుసుకోవ‌చ్చు.

 

అందుకు ముందుగా.. మీరు ఎవ‌రి గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నారో.. వారి చాట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వారికి మెసేజ్ చేయండి. ఇప్పుడు మీ మెసేజ్ పై దాన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా సెలక్ట్ అవుతుంది. అప్పుడు కుడివైపు పైభాగంలో మీకు కనిపించే మూడు చుక్కల ఐకాన్ పై క్లిక్ చేయండి. అంతే ఆ వ్యక్తికి మీ మెసేజ్ ఎప్పుడు రీచ్ అయిందో, దాన్ని వారు ఎప్పుడు చదివారో కూడా మీరు తెలుసుకోవచ్చు. వారి మీ మెసేజ్ చ‌దువుంటే.. అక్క‌డ ఏ టైమ్‌కి చ‌దివారో కూడా తెలుస్తుంది. మ‌రియు ఈ ట్రిక్ వాట్సాప్ గ్రూప్ లో కూడా యూజ్ చేయ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: