అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతనో ది రియల్‌ లైఫ్‌ ఐరన్‌ మ్యాన్‌ అనే చెప్పాలి.. మార్స్ గ్రహం, చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లాలని ఎంతగానో తహతహలాడుతున్నాడు. ఇక అందుకోసం ఇప్పటికే మనుషులను ఇతర గ్రహలపైకి రవాణాచేసే అంతరిక్షనౌక స్టార్‌షిప్‌ ప్రయోగాలను స్పేస్‌ఎక్స్‌ కంపెనీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా అనేక వైఫల్యాల తరువాత అంతరిక్షనౌక స్టార్‌షిప్‌..ఆకాశంలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసి గాల్లో చక్కర్లు కొడుతూ హై ఆల్టిట్యూడ్‌ టెస్ట్‌ను విజయవంతంగా స్పేస్‌ఎక్స్‌ కంపెనీ పరీక్షించింది.ఇక ఎలన్‌ మస్క్‌ కలల ప్రాజెక్ట్‌ స్టార్‌షిప్‌ మరో కొత్త చరిత్రను సృష్టించబోతుందనే చెప్పాలి. స్టార్‌షిప్‌ను మొదటి సారిగా భూ నిర్ణీత కక్ష్యలోనికి పంపాలని ప్రణాళిక చేస్తోంది. స్టార్‌షిప్‌ ఆర్బిటల్‌ ఎక్స్పెరిమెంట్ ను జూలైలో లాంచ్‌ చేయనున్నట్లు స్పేస్‌ఎక్స్‌ అధ్యక్షురాలు గ్విన్నే షాట్‌వెల్‌ పేర్కొనడం జరిగింది.

ఇక మొన్న శుక్రవారం జరిగిన నేషనల్ స్పేస్ సొసైటీ అఫ్‌ ఇంటర్నేషనల్‌ స్పేస్‌ మీటింగ్లో షాట్వెల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్టార్‌షిప్‌తో చేసే ఆర్బిటల్‌ ప్రయోగం చరిత్ర సృష్టించబోతుందని పేర్కొనడం జరిగింది. ఇక ఈ ప్రయోగం కష్టంతో కూడుకున్న పనే అయినా.. స్పేస్‌ ఎక్స్‌ సైన్టిస్టులు ఆర్బిటల్‌ లాంచ్‌ ప్రయోగాన్ని విజయవంతం చేస్తామనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపడం జరిగింది.ఇక స్టార్‌షిప్‌ ఆర్బిటల్‌ లాంచ్‌ ఎక్స్పెరిమెంట్ 90 నిమిషాలపాటు జరిగే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది.కాగా ప్రస్తుతం ఈ ఎక్స్ పెరిమెంట్ కి ఫెడరల్‌ ఏవియేషన్‌ అఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఆమోదం రాలేదు. ఇక అంతేకాకుండా స్టార్‌షిప్‌ ఆర్బిటల్‌ లాంచ్‌ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఈ ఎక్స్ పెరిమెంట్ కి అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్‌ఎక్స్‌ కంపెనీ అధ్యక్షురాలు గ్విన్నే షాట్‌వెల్‌ ఆశాభావం వ్యక్తం చెయ్యడం జరిగింది. ఇక స్టార్‌షిప్‌ ఎక్స్ పెరిమెంట్ విజయవంతమైతే ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష చరిత్రలో కొత్త రికార్డు సృష్టిస్తోందని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: