మనిషి ఉన్న భూమిని పూర్తిగా నాశనం చేయడానికి మరో రెండు లేదా మూడు దశాబ్దాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అంటే ఇక ఇక్కడ జీవించడానికి సరిపడదు వాతావరణం. అయితే మరో రెండు దశాబ్దాలలో అంగారక గ్రహంపై(మార్స్) అడుగు పెట్టనున్నాడు, అనంతరం మరో దశాబ్దంలో అక్కడే నివాసములు కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాడు అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. ఎప్పటి నుండి అంతరిక్షంలోని గ్రహాలు, వాటి కదలికలు, ఆయా గ్రహాలలో జీవజాలం మనుగడ వంటి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నాసా కు చెందిన జెట్ ప్రొపల్షన్ లోని పరిశోధనా కేంద్రంలో పలు కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఈ విషయాలను శాస్త్రవేత్తలు ప్రీప్రింట్ పేపర్ లో తెలిపారు.

దానిప్రకారం, కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే మనిషి అంగారక గ్రహంపై నడుస్తాడని, అలాగే మరో దశాబ్దంలో బృహస్పతి లేదా శని గ్రహంపై కూడా అడుగుపెడతారని అంచనా వేస్తున్నారు. నాసా ప్రకారం, దాదాపుగా 2383 వ సంవత్సరంలో మనుషులు సౌరవ్యవస్థ వెలుపల నుండి ఏలియన్స్ జాతులను కలిసే అవకాశం రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనిషి 2038లో అంగరహాగ్రహంపైకి వెళ్లగలడు, 2086 నాటికీ శని గ్రహంపైకి వెళ్లదలడు, 2254 నాటికి సౌరవ్యవస్థ దాటి వెళ్లగలడు. ఈ తరుణంలోనే ఏదో ఒక చోట మనిషి ఏలియన్స్ ను పలకరించాల్సి రావచ్చు. అదికూడా 2383 నాటికి సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  

ఇదంతా ఇంకా తక్కువ సమయంలోనే సాధ్యం అవుతుందని, సౌరవ్యవస్థ నుండి 14000కాంతి సంవత్సరాల దూరంలోనే ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమిపై సాంకేతికత వలన పచ్చదనం కనిపించకపోవడం వలన మనిషి ఇక్కడ మరో మూడు దశాబ్దాల కంటే నివసించలేడని, అందువలన మరొక గ్రహానికి పయనం అవుతాడని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇవన్నీ సాధ్యమేనా అంటే భూమిపై మాత్రం పరిస్థితులు రానురాను అలాగే ఉన్నట్టు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నాయన్నది మాత్రం నిజం.  ఇక వేరే గ్రహంలో జీవించడం లాంటివి ముందుముందు చూడాల్సిన పరిణామాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: