ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి.. ఇక ఇలాంటి పరిస్థితులలోనే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతోంది ప్రజలు. పెట్రోల్,డీజిల్ వంటి వాటితో నడిచే వాహనాలు కంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు.. కానీ ప్రస్తుత పరిస్థితులలో జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు కొంతమంది నిపుణులు.


అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. కానీ ఇప్పుడు చెప్పబోయే టాటా నెక్సాన్ EV వాహనం మాత్రం ఖర్చు ఉన్నప్పటికీ దీని వల్ల ఎంతో లాభం కూడా చేకూరుతుంది.. అది ఎలా అంటే కేవలం  580 రూపాయలతో ఈ కారు దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. ఇక ఈ కారు ధర, స్పెసిఫికేషన్ వివరాల గురించి తెలుసుకుందాం.ఈ టాటా నెక్సాన్ EV కారు ధర 14 ,24,000 నుండి వీటి ధర ప్రారంభం అవుతుందట. ఇక అంతే కాకుండా ఈ కారు కేవలం 10 సెకన్లలో..0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ఇక ఇందులో మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్ ద్వారా ఇది ఇంత స్పీడుగా వెళుతుందట. ఇక ఈ కారులో బ్యాటరీ విషయానికి వస్తే..IP 67 సర్టిఫైడ్ చేసిన.30.2KWH లిథియం అయాన్ బ్యాటరీ ని అమర్చరట.ఇక ఈ కారు ఒక గంటలో 80 శాతం వరకు పూర్తి చార్జింగ్ అవుతుందట.. మన ఇంట్లో నుంచి ఈ వాహనానికి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక యూనిట్ కి 6 రూపాయల విద్యుత్ రేటు సగటున వేసుకుంటే.. కేవలం ఒక్క సారి ఛార్జింగ్ చేసినట్లు అయితే..181 రూపాయలు ఖర్చవుతుంది. ఇక దీంతో 312 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. ఈ విధంగా మనం కిలోమీటర్ కు ఖర్చు వేసుకుంటే..58 పైసలు అవుతుంది.. ఇక 1000 K.M ఖర్చు వేసుకుంటే కేవలం 580 అవుతుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: