హర్యానా రాష్ట్రానికి చెందిన గ్రీన్ మాస్టర్స్ (Green Masters) అనే ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. చాలా సింపుల్‌గా కనిపించే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అంతే సింపుల్ ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి. వీటిని రోడ్లపై నడపడానికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి ఏవి అవసరం లేదు. ఎందుకంటే వీటి గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు మాత్రమే. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రం హైవేపై నడపటానికి అనుమతి లేదు. కేవలం సిటీ రోడ్లపై అర్బన్ ఇంకా రూరల్ రోడ్లపైన మాత్రమే వీటిని వినియోగించుకోవచ్చు.ఇక గ్రీన్ మాస్టర్స్ ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీలో మనకు బాగా పరిచయం ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 ఇంకా అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిళ్లలో వాడే అనేక భాగాలను ఉపయోగించారు. ఈ కారు తాళం చెవి, సైడ్ మిర్రర్స్ ఇంకా అలాగే వీల్స్ వంటి వాటిని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కూడా మనం గమనించవచ్చు. అలాగే, డ్రైవ్‌ట్రైన్ లోని కొన్ని మెయిన్ పార్ట్స్ ను ఆల్టో కార్లలో ఉపయోగించే పరికరాల నుండి సేకరించారు. కాబట్టి, కారును కొన్న తర్వాత స్పేర్ పార్ట్స్ కి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా కాని అసలు చింతించాల్సిన అవసరం లేదు.



ఇక గ్రీన్ మాస్టర్స్ అందిస్తున్న ఈ క్లాసిక్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.1.45 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. వీటికి రిజిస్ట్రేషన్ ఇంకా అలాగే లైసెన్స్ వంటివి అవసరం లేవు కాబట్టి, కస్టమర్లు జిఎస్‌టి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అయితే, షిప్పింగ్ చార్జీలు అనేవి మాత్రం అదనంగా ఉంటాయి.మీరు ఖచ్చితమైన షిప్పింగ్ చార్జీల కోసం కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది.ఇక ఇందులోని బేస్ మోడల్ 2-సీటర్ వేరియంట్ రూపంలో వస్తుంది. ఇది మనకు మెరూన్ ఇంకా అలాగే గ్రే కలర్లలో అందుబాటులో ఉంటుంది.ఇక ఈ బేస్ వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 50-60 కిలోమీటర్ల రేంజ్ స్పీడ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. ఇక దీనిని పూర్తిగా చార్జ్ చేయడానికి కనీసం 4-5 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 1 ఏడాది వారంటీని కూడా అందిస్తుంది. దీని టాప్-స్పీడ్ గంటకు 40 నుంచి 45 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులో స్పోక్ వీల్స్ అనేవి లభిస్తాయి, కానీ స్పేర్ టైర్ మాత్రం లభించదు. దీని కొలతల విషయానికి వస్తే ఇది 2.74 మీ పొడవు, 1.37 మీ ఎత్తు, 450 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 200 కేజీల బరువు ఇంకా అలాగే 70 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: