ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియా ఉపయోగిస్తున్న యాప్ లలో వాట్సాప్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్స్ లో డాక్యుమెంట్స్ వీడియోలను ఫోటోలను వంటివి షేర్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే మరి కొంతమంది బిజినెస్ తీసుకోవాలని పలు రకాల వ్యాపారాలు చేయాలని లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా లోన్లు తీసుకోవడానికి ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది. కానీ తాజాగా IFL కంపెనీ వాట్సాప్ ద్వారా రూ.10 లక్షల రూపాయల వరకు బిజినెస్ లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

అయితే ఇది ఇన్స్టంట్ అప్రూవల్ లోన్ కింద ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది .ఈ లోన్ MSM లోన్ జారీ ప్రక్రియలో గేమ్ చేంజర్ అన్నట్లుగా తెలుస్తోంది.  రుణ దరఖాస్తు నుంచి డబ్బు కస్టమర్ కు బదిలీ అయ్యేంతవరకు 100% డిజిటల్ గానే ఉంటుందట. ఇండియాలో 450 మిలియన్లకు పైగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు IIFL ఫైనాన్సు నుంచి డిజిటల్ లోని ఈ సదుపాయాన్ని పొందవచ్చు. పది మిలియన్లకు పైగా కస్టమర్లు కలిగి ఉన్న భారతదేశంలో ఒకటిగా ఈ సంస్థ ఉన్నది.

ఈ కంపెనీ చిన్న తరహా పరిశ్రమలకు కూడా రుణాలను అందిస్తుందట  దీంతో దేశమంతట బ్రాంచ్లు డిజిటల్ గా అందుబాటులోకి ఉండడంతో రుణం కోసం చూస్తున్న చిన్న వ్యాపారవేత్తలకు ఈ వాట్సప్ సదుపాయం ద్వారా లోన్ తీసుకోవచ్చు.  ఈ అద్భుతమైన సదుపాయాన్ని పొందేందుకు వారు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయాల్సి ఉంటుంది. అవసరమైతే అప్లికేషన్లు అన్ని వివరాలతో నింపి ఇచ్చిన యెడల మీ లోన్ ఆమోదాన్ని పొందుతారు . ఈ ప్రక్రియ కాగిత రహితంగా ఉంటుంది. అయితే కేవలం 9019702184 నెంబర్ కు హాయ్ అని టైప్ చేసి మెసేజ్ పంపితే చాలు ఈ లోన్ ప్రక్రియ ప్రారంభమవుతుందట. IIFL ఫైనాన్స్ ప్రస్తుతం వాట్సాప్ లో ఛానల్ ద్వారా ఒక లక్ష MSM ఈ క్రెడిట్ విచారణలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ చిన్న వ్యాపారులపై దృష్టి ఎక్కువగా పెడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: