మరీ ముఖ్యంగా గత ఏడాది వచ్చిన నాలుగో సీజన్ వల్ల చాలా మంది కంటెస్టెంట్లు ఫుల్ ఫేమస్ అయ్యారు. సోహెల్, అరియాన వీరిద్దరూ కూడా చాలా ఫేమస్ అయ్యారు.బిగ్ బాస్ హౌస్‌లో తరచూ గొడవలకు దిగుతూ వార్తల్లో నిలుస్తుండేవారు. దీంతో వీళ్లకు టామ్ అండ్ జెర్రీ అనే పేరొచ్చింది. అలాంటి వీళ్లు.. తాజాగా రొమాన్స్‌తో రెచ్చిపోయారు. నాలుగో సీజన్‌లో మొదటి రోజు మొత్తం 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్ మాత్రమే జంటగా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి రెండు రోజుల పాటు మిగిలిన కంటెస్టెంట్లను ఆడుకున్నారు..
బిగ్ బాస్ షో తర్వాత అటు ఆరియానా గ్లోరీ, ఇటు సోహెల్ ఫుల్ బిజీ అయిపోయారు. ఇద్దరూ వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బోల్డ్ బ్యూటీ స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో ముక్కు అవినాష్‌తో కలిసి కొన్ని స్కిట్లు చేస్తోంది. తాజాగా ఈ షోకు సయ్యద్ సోహెల్ రియాన్ కూడా వచ్చాడు. దీంతో వీళ్లిద్దరూ కలిసి తొలిసారి రొమాన్స్ చేసి షాకిచ్చారు. కామెడీ స్టార్స్ షో వీరి రొమాన్స్ తో కొన్ని నిమిషాల పాటు వేడి వాతావరణాన్ని సృష్టించారు.జనవరి మాసం' అంటూ సాగే పాటకు రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూసుకుంటూ క్లోజ్‌గా కనిపించారు. దీంతో పక్కనే ఉన్న అవినాష్ నిరాశగా కనిపించినట్లు చూపించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. మోనాల్ కు సిస్టర్ లా ఉందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి