బుల్లి తెర పై క్రేజ్ ను తెచ్చుకున్న సీరియల్స్ లో ప్రముఖంగా వినిపించే సీరియల్ కార్తీక దీపం.. కార్తీక్ పాత్రలో నిరుపమ్.. వంటలక్క, దీప క్యారెక్టర్‌లో ప్రేమీ విశ్వనాథ్ క్రియేట్ చేసిన, చేస్తోన్న వండర్స్ అన్నీ ఇన్నీ కావు. మొన్నీ మధ్యే వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి కావడంతో కార్తీకదీపం టీం రచ్చ రచ్చ చేసింది. నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, శోభా శెట్టి ఇలా కార్తీక దీపం టీం అంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ కూడా బాగా ఫేమస్ అయ్యారు


గతేడాది దసరా ఈవెంట్‌ తో తొలిసారిగా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఇద్దరూ కూడా బుల్లితెరపైకి వచ్చారు. ఆ తరువాత మళ్లీ స్పెషల్ ఈవెంట్లకు వారు గెస్టులుగా వస్తూనే ఉన్నారు. అలా ఇప్పుడు ఉగాది ఈవెంట్‌ లోనూ వీరే హైలెట్ కాబోతోన్నట్టు కనిపిస్తోంది.దసరాకు అమ్మ వారిగా కనిపించిన ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడు సీతమ్మ వారిలా మారిపోయింది. నిరుపమ్ శ్రీరాముడిలా మారిపోయాడు. పిల్లలిద్దరూ లవకుశులు గా మారారు. వీరంతా కలిసి బుల్లితెరపై రామాయణాన్ని అందరికీ చూపించేందుకు రెడీ అయ్యారు.


ఈవెంట్ లో కార్తీక దీపం సీరియల్ లోని వారంతా కాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామాయణ గాథను చూపించడమే కాకుండా.. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ వంటలక్క చుట్టూ డాక్టర్ బాబు తిరుగుతూ డ్యాన్సులు కూడా వేసేశాడు. ఇక ఈ సీన్ ఈవెంట్ మొత్తానికి హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలా డాక్టర్ బాబు, వంటలక్క మధ్య రొమాన్స్, కెమిస్ట్రీని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మొత్తా నికీ ఏదో చేద్దామని ప్రయత్నించారు.. ఆరోజు ఈవెంట్ లో ఎలా చేస్తారో చూడాలి.. ప్రస్తుతం ఈ షోకి సంబంధించి న ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: