మహేష్ బాబు నటించిన అతడు చిత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇక ఇందులో బ్రహ్మానందం కొడుకు గా నటించిన ఒక బుడ్డోడు మనకి గుర్తుంటాడు. ఈ బాల నటుడు చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా బాగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా గుర్తింపు సంపాదించిన ఇమేజ్ తోనే బిగ్ బాస్-5 లో కి అడుగు పెట్టబోతున్నట్లు గా సమాచారం.

ఇక ఈ బుద్ధుడు అతడు సినిమా లోనే కాకుండా భద్ర సినిమాలో కూడా నటించాడు. ఇతడి పేరు దీపక్ సరోజ్. ఇక ఈ దీపక్ చదువు పూర్తి చేసుకున్నాడు ఈ మధ్యకాలంలోనే. ఇక ప్రస్తుతం తాను నటుడిగా ఎదగాలని తెగ ఆశ పడుతున్నాడట. అంతలోనే ఆయన కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అన్నట్లు గా సమాచారం. తన చిన్నతనం నుంచి 20 సినిమాలకు పైగా నటించాడు దీపక్.
ఆ తర్వాత చదువుకోవడానికి కొద్దిరోజులు విరామం తీసుకున్నాడు. మరి 2014 సంవత్సరంలో మిణుగురులు అనే సినిమా ద్వారా నటించి నేషనల్ అవార్డును అందుకున్నాడు ఈ చిన్నోడు. మళ్లీ తిరిగి ఏడు సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ ఆఫర్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే బిగ్ బాస్-5 కోసం ఆయన క్వారంటైన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

ఇక హీరోలకు సమానంగానే తన శరీర ఫిట్ నెస్ ని మెయింటెన్ చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఇతను కనుక బిగ్ బాస్ ఫైవ్ లో ఎంట్రీ ఇస్తే , ఇక తన దశ తిరిగిపోయింది అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి