సౌందర్య అసలు పేరు అర్చన.. ఈమెది కులాంతర వివాహం.. క్రో ప్రొడ్యూసర్ అయిన అనంత్ ను వివాహం చేసుకున్నారు. అంతే కాదు సౌందర్యకు 11 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి కూడా ఉన్నారు. సౌందర్యకు నటన మీద ఆసక్తి ఎక్కువ కావడంతో కేరళ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. కేరళలో కూడా అక్కడ కొన్ని టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఈమె నటనకు ఫిదా అయిన తెలుగు బుల్లితెర డైరెక్టర్స్ ఎలాగైనా సరే సౌందర్య తో ఒక మంచి పాత్ర చేయించాలని అనుకుంటున్నారట..
అలా కార్తీకదీపం సీరియల్ లో పవర్ఫుల్ అత్త పాత్రలో నటించడానికి ఈమెను తీసుకున్నారు. తన నటనకు పూర్తి న్యాయం చేస్తూ దర్శకుల ఆలోచనలకు తగ్గట్టుగా నటిస్తూ అందరినీ మెప్పిస్తుంది. మలయాళీ భామ అయినప్పటికీ తెలుగు ,మలయాళం ,కన్నడ ,తమిళ్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు కూడా. అంతేకాదు ఈమె కేవలం నటి మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా. ఇక సౌందర్య సినిమాలలోకి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడానికి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని చెప్పుకొస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి