అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకుల ఆకట్టుకుంటున్న యాంకర్లలో యాంకర్ వర్షిని కూడా ఒకరు. చూడడానికి చిన్న పిల్ల వలె కనిపించినా, తన అందాల సోయగాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇకపోతే తాజాగా యాంకర్ వర్షిని పెళ్లి గురించి చర్చ జరుగుతోంది..ఎందుకంటే ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఈమె చేసిన ఒక పోస్టు వైరల్ గా మారింది. అంతే కాదు ఈ పోస్టుకు నెటిజన్ల కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అర్ధగంటలో యాంకర్ వర్షిని వివాహం.. ఈ టైటిల్ చూసి నెటిజన్లు మాత్రమే కాదు వర్షిని కూడా షాక్ అయిందట..


నిజానికి జరిగిన విషయం ఏమిటో మనం కూడా ఒక సారి చూద్దాం.. అసలు విషయంలోకి వెళితే, ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ లో రకరకాల వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. అంతే కాదు గిబ్బిరిష్ అంటూ వెరైటీ పదాలను కనిపెట్టే ఒక ఆట కూడా ఆడుతున్నారు.. ఇక ఇంస్టాగ్రామ్ లో వచ్చే కొన్ని ఆటల ద్వారా వింత వింత ప్రశ్నలు వాటికి సమాధానాలు కూడా వస్తూ ఉంటాయి.. వర్షిని కూడా ఇన్స్టాల్ లో వస్తున్న  యాప్ లో ఈ ఆట ఆడుతూ ఉండగా సడన్ గా పెళ్లి కి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది..


ఆ ప్రశ్న ఏమిటంటే నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది..? అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇంకో అర్ధగంటలో అనే సమాధానం రావడంతో యాక్టర్ వర్షిని కూడా షాక్ కు గురైంది.. అంతే కాదు ఇది ఏంటి అన్నట్టుగా ఆమె ఒక్కసారి షాక్ అవ్వడంతో వర్షిని పెళ్లి అర్ధగంటలో అనే సమాధానం రావడం చూసి , నెటిజన్లు కూడా బాగా సెటైర్లు వేస్తున్నారు.. నేను రెడీ అని ఒకరంటే ,మరొకరు ఏమో ఎక్కడికి రావాలో చెప్పు అంటూ రకరకాల కామెంట్లు చేయడం గమనార్హం. అలా వర్షిని పెళ్లి మీద ఇప్పుడు నెట్టింట్లో బాగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఆమె నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వరకు వెళ్లలేదని  ఆమె స్వయంగా ఇంటర్యూలో తెలిపిన విషయం మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: