జబర్దస్త్ లో కమెడియన్ గా ఉన్న రాకింగ్ రాకేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎక్కువగా చిన్నపిల్లలతో స్కిట్ లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.. అయితే గత కొద్ది రోజుల నుంచి.. జబర్దస్తులో చిన్న పిల్లలను తీసివేసి ఎక్కువగా సీరియల్ యాక్టర్ ల ని తీసుకొస్తున్నారు జబర్దస్త్ కంటెస్టెంట్ లు.. ఈ నేపథ్యంలోనే రాకేష్ ఒక సరికొత్త అమ్మాయిని తీసుకువచ్చారు.. ఇక ఆమెతో ప్రేమలో ఉన్నట్లుగా ఈ విషయాన్ని అందరి ముందర తెలియజేయడం జరిగింది..ఇక వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.


ఆమె పేరు జోర్దార్ సుజాత ఒకప్పుడు న్యూస్ రీడర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించింది.. బిగ్ బాస్ లో ప్రతి సీజన్లో కూడా ఒక న్యూస్ రీడర్లు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు.. అలా బిగ్ బాస్-4 లో సుజాతను తీసుకున్నారట. కానీ ఆమె అందులో నుంచి త్వరగానే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.. ఆమె బిగ్ బాస్ లో చేసినటువంటి చేష్టల వల్ల ఆమెను అసహ్యించుకునే వారు.. అయితే కొంత మంది మాత్రం ఆమె నవ్వుకు ఫిదా అవుతూ అభిమానులు గా మారినట్లు తెలుస్తోంది. ఇక నాగార్జునను బిట్టు అని పిలవడంతో ఆమెపై నెగిటివ్ మార్కింగ్ ఏర్పడింది. ఇక అంతే కాకుండా అభిజిత్ విషయంలో కూడా సుజాత కు ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం.

అలా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈమె బుల్లితెరపై వరుస అవకాశాలు సంపాదించుకుంది.. పలు ఈవెంట్లలో, కామెడీ స్టార్స్, జబర్దస్త్ వంటి షోలలో ఆమె బాగానే రాణిస్తోంది.. ఇక రాకేష్ తన టీంలో పిల్లలు లేకపోవడంతో ఇలా సరికొత్త ఆర్టిస్టులను తీసుకువస్తూ ఉన్నాడు.. ఇలా సుజాతతో కూడా ఎన్నో స్కిట్ లలో చేయించాడు రాకేష్.. మధ్యలో రోహిణితో ట్రాక్ నటించినప్పటికీ.. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సుజాత తో ట్రాక్ నడుస్తున్నట్టుగా ఒక ప్రోమో లో చూపించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: