భీమ్లా నాయక్ సినిమా ఎంతో మంది నటులకు బాగా గుర్తింపు వచ్చింది.. ఇక ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న నటులలో M.S. చౌదరి కూడా ఒకరు. ఒక ప్రముఖ ఈటీవీ ఛానల్ ద్వారా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ నటుడు ఆదిగురువు అమ్మ అనే చిత్రానికి డైరెక్టర్ గా కూడా వ్యవహరించారని వెల్లడించారు. అలా ఎన్నో సినిమాలకు పని చేసినప్పటికీ .. కొంతమంది మనకు డబ్బులు ఎక్కువగా ఇచ్చే నిర్మాతలు కూడా ఉన్నారని తెలియజేశారు చౌదరి.


ఇక మరికొంతమంది తన పాత్రలను సినిమాల్లో కట్ చేసినందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. అలా 6,7 సినిమాలకు ఇలానే చేశారని M.S చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం తన పర్సనాలిటీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారని మొదట్లో తను మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేశారు. సన్నగా ఉన్నప్పుడు తన ముఖంలో కళ లేదని ఎవరూ చూడలేదని ఆయన వెల్లడించారు. కనిపించే ప్రతి ఒక్కరు సిక్స్ ప్యాక్ లో కనిపించాలంటే ఎలా సాధ్యమవుతుందని తెలియజేశారు చౌదరి. ఇక వాటి మీద శ్రద్ధ పెట్టే బదులు యాక్టింగ్ పైన శ్రద్ధ పెడితే మంచి నటుడు అవ్వచ్చు అని తెలిపారు ఆయన. ఒకవేళ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేసినట్లు అయితే కృష్ణుడు పాత్రకు సెట్ అయ్యేవారు కాదు అని తెలిపారు.

రాజీవ్ కనకాల గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతూ.. రాజీవ్ కనకాల ని కొద్ది రోజుల క్రితం కలవగా మొదట అతను నన్ను గుర్తుపట్టలేదు అని తెలిపారు చౌదరి. తరువాత తను M.S చౌదరి అని తెలపగా కౌగిలించుకున్నారు అని తెలిపారు. ఇక తనతో చేయడం నా అదృష్టం అని రాజీవ్ కనకాల తెలిపారని చౌదరి తెలిపారు. శాంతికుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాని తెరకెక్కించడం అందుకు రాజీవ్ కనకాల మీకు ఎన్ని నంది అవార్డులు వచ్చాయి అని అడగగా 17 అని తన కాళ్లకు నమస్కారం పెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: