తెలుగులో జెమినీ టీవీ ఛానల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ మా ,జీ తెలుగు లేని సమయంలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నది. ఈటీవీ, జెమినీ టీవీ ఒకేసారి అటు ఇటుగా ప్రారంభమయ్యాయట. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పరిచయం చేసింది ఈ రెండు చానల్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రెండు చానల్స్ మధ్య గట్టి పోటీ ఉండేది. ప్రతిసారి కూడా ఈ రెండు చానల్స్ ఎప్పుడూ నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతూ ఉండే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం స్టార్ మా, జీ తెలుగు వంటి వాటి హవా మాత్రమే బాగా కొనసాగుతోందని చెప్పవచ్చు.


ముఖ్యంగా ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర ప్రోగ్రాంలో వల్ల ఈ చానల్స్ కాస్త నిలబడ్డాయి.కానీ జెమినీ టీవీకి ఇలాంటివన్నీ ఏమీ లేనందు వల్లే దారుణమైన పరిస్థితి ఏర్పడిందని బుల్లితెర ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. తమిళనాడు కు చెందిన సన్ నెట్వర్క్ వారి జెమినీ టీవీ 4వ స్థానంలో ఉన్నది. సీరియల్స్ గాని ఏ ఒక్కటి కూడా జెమినీ టీవీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టేలా కనిపించలేదు. భారీ మొత్తంలో ఖర్చు చేసి సినిమాలను కొనుగోలు చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోతుందట.


ముఖ్యంగా ఒకప్పుడు నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ తెలుగు ఛానల్ రేటింగ్ విషయంలో చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ జర్నలిస్ట్ చెప్పిన ప్రకారం జెమినీ టీవీ యాజమాన్యం రూ. 100 రూపాయలు ఖర్చు చేయగా కేవలం రూ.25 రూపాయలు మాత్రమే తిరిగి వస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పరిస్థితి చూస్తే అలాగే ఉంది అంటూ మరికొంతమంది బుల్లితెర ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా జెమినీ టీవీ, జెమినీ సినిమాలు, జెమినీ మ్యూజిక్ మూడు చానల్స్ కూడా పెద్దగా రేటింగ్ దక్కించుకోలేని కారణం చేత త్వరలో తెలుగు రాష్ట్రాలలో సన్ నెట్వర్క్ దుకాణం మూసివేసిన కూడా ఆశ్చర్యం లేదంటూ పలువురు మీడియా వర్గాలు తెలియజేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం జెమినీ ఛానల్స్ అభిమానులు మాత్రం వీటికి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: