గడిచిన కొద్దిరోజుల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ నటి సౌమ్యశెట్టి ఇటీవల అరెస్టు కావడం జరిగింది.ముఖ్యంగా విశాఖపట్నం దొండపర్తిలో నివసించే ఒక రిటైర్డ్ అధికారి ఇంట్లో ఈమె 74 తులాల బంగారు దొంగలించింది అంటూ పోలీసుల అరెస్టు చేయడం జరిగింది.. ఈ నగలతో గోవా పారిపోయిన సౌమ్య శెట్టి కొంత బంగారం అమ్మేసిందని ఆ తర్వాత ఈమెను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.పోలీసులు 45 తులాల బంగారు రికవరీ చేశారని మిగతా బంగారం ఆమె ఖర్చు చేసి జల్సాలు చేసిందని విషయాలు ఎక్కువగా వినిపించాయి.


అయితే తన పైన తప్పుడు కేసు పెట్టారు అంటూ నటి సౌమ్య శెట్టి తన ఇంస్టాగ్రామ్ లో దొంగతన ఆరోపణల పైన ఆమె స్పందించడం జరిగింది.. సౌమ్య శెట్టి మాట్లాడుతూ తనమీద తప్పుడు కేసు బరాయించారని రిమాండ్లు లేకపోయినప్పటికీ జైలుకు వెళ్లకపోయినాప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాతీయస్థాయిలో తలను అన్ ఫాలో చేశారని నిజం ఏమిటో మాట్లాడుతుంటే చాలామంది కేసులు పెట్టి తనని నొక్కేస్తున్నారంటూ తెలియజేస్తోంది. మీరు అబద్ధాన్ని నిజం చేయవచ్చు..

 కానీ దొంగ అనే ట్యాగ్ ను తనకు తగిలించి జైల్లో వేయాలనుకుంటున్నారు.. నా ధైర్యాన్ని మీరు దెబ్బ తీయలేరు నాకు ఒక కుటుంబం ఉంది కోర్టులో ఏది రుజువు కాకముందే తన పైన దుష్ప్రచారం చేశారంటూ తన జీవితాన్ని నాశనం చేశారంటూ వెల్లడిస్తోంది. నాకు దేవుడు పైన నమ్మకం ఉంది.. నేను పోరాడుతూనే ఉంటానని తెలిపింది సౌమ్యశెట్టి.. తన పైన దొంగతనం కేసు పెట్టిన రిటైర్డ్ పోస్టల్ అధికారి ప్రసాద్ బాబు కుటుంబం పైన కూడా మానవ హక్కులకు సైతం ఫిర్యాదు చేశానంటూ తెలిపింది. అలాగే తన మీద తప్పుడు ఆరోపణలు చేసిన వీడియోలలో బిగ్బాస్ ఫేమ్ గీతు రాయల్.. యాంకర్ ధనుష్ ల మీద కూడా పరువు నష్ట ధావం వేస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: