
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతూ ఉన్నారు. ప్రతి సీజన్లో కూడా నాగార్జున ఆడియన్స్ అని బాగా ఆకట్టుకుంటున్నారు. గత ఆరు సీజన్లు నాగార్జున నడిపిన తీరు ప్రేక్షకులు కూడా బాగా ఆకట్టుకోవడంతో బిగ్ బాస్ నిర్వహకులు మరి ఎవరి వైపు చూడలేదు.. దీంతో నాగార్జునకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మరి బిగ్ బాస్ షో నిర్వాహకులు హొస్టుగా నాగార్జుననే కంటిన్యూ చేస్తున్నారు. నాగార్జున ప్రతి సీజన్ కు తన రెమ్యూనరేషన్ ని పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా రూ .30 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం మాత్రం ఇప్పుడు బుల్లితెర వర్గాలలో వైరల్ గా మారుతోంది.
నాగార్జున హీరోగా 30 ఏళ్ల సినీ కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించారు. ఇప్పుడు తాజాగా కూలి అనే చిత్రంలో విలన్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. సుమారుగా 350 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోగా రజనీకాంత్ నటిస్తున్నారు. ఇలా ఒకవైపు హీరోగా మరొకవైపు హొస్ట్ గా ముందుకు వెళుతున్న నాగార్జున 100 వ చిత్రానికి కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.