ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మి ఇప్పుడు ఎన్నో ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పటికీ ఈ ఫోన్లకు మంచి డిమాండ్ ను అందుకున్నాయి. రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఎంఐ.కాంలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లలో హైఎండ్ మోడల్ ఇదే. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.


నోట్ 10 సిరిస్ లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.. వాటి ఫీచర్స్ మరియు ధరను ఒకసారి చూద్దాం..6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,999గా నిర్ణయించారు. డార్క్ నైట్, గ్లేసియర్ బ్లూ, వింటేజ్ బ్రాంజ్ రంగుల్లోనే ఈ ఫోన్ కూడా అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్లను ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు జియో వినియోగదారులకు రూ.10 వేల విలువైన అదనపు లాభాలు  కూడా అందుకోవచ్చు..


కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇందులో కూడా అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే  అవకాశం కూడా ఉంది.వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ కెమెరాలో నైట్ మోడ్ 2.0, వ్లాగ్ మోడ్, మ్యాజిక్ క్లోన్ మోడ్, లాంగ్ ఎక్స్‌పోజర్ మోడ్, వీడియో ప్రో మోడ్, డ్యూయల్ వీడియో ఫీచర్లు ఉన్నాయి... బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: