వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఎక్కువ ప్రజాధరణ పొందిన మెసేజీంగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలమంది ఈ యాప్ ని వాడుతుంటారు.ఇక ఎప్పటికప్పుడు కూడా బాగా అప్‭డేట్ అవుతూ టెక్నాలజీకి తగ్గట్టుగా అడ్వాన్స్‭డ్‭గా ఉండే వాట్సాప్.. ఈసారి మరికొన్ని కొత్త ఫీచర్లతో మన ముందుకు వచ్చింది.ఇక ఇందులో మొదటి ఫీచర్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉన్నవాళ్లు.. ఒకే సమయంలో పది డివైస్‭లలో లాగిన్ అవ్వవచ్చు. ఇప్పటి వరకు ఇది నాలుగు డివైస్‭ల వరకు అనుమతి ఉండగా.. తాజాగా దీనిని పదికి పెంచారు.అలాగే రెండవ ఫీచర్ వచ్చేసి గ్రూప్ మెంబర్స్ లిమిట్. ఈ ఏడాది మేలో వాట్సాప్‌ గ్రూప్‌ మెంబర్స్ సంఖ్యను 256 నుంచి 512కి మార్చింది. ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని మెటా సంస్థ యోచిస్తోంది. 


వాట్సాప్ బెటా ఇన్ఫో నివేదిక ప్రకారం, వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ని బీటా టెస్టర్‌లకు లిమిట్ చేసింది. త్వరలో ఈ ఫీచర్ ఇతర యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో ఒకే సమయంలో ఎక్కవ మంది చాట్ చేసే వీలు ఉంటుంది.మూడవ ఫీచర్ విషయానికి వస్తే..వీడియో కాల్ పరిమితి పెరగనుంది. ఏక కాలంలో 32 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చు. క్రితం ఇది చాలా తక్కువగా ఉండేది. ఇవే కాకుండా మరిన్ని అప్‭డేట్లు కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. జూమ్ అండ్ గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ లింక్‌లను షేర్ చేసే ఫీచర్‌తో వాట్సాప్ కూడా వస్తోందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఈ లింక్ సహాయంతో ఎవరైనా ఏదైనా గ్రూప్ కాల్ లేదా మీటింగ్‌లో చేరవచ్చు. వాట్సాప్ 2జీబీ వరకు ఫైల్‌లను షేర్ చేయడానికి అప్‌డేట్‌ను విడుదల చేయబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి.ఇవే ఆకట్టుకునే ఫీచర్లు. ఇలా ఎప్పుడూ కూడా వాట్సాప్ తన కొత్త ఫీచర్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: